ఆర్థిక స్వావలంభ‌నకు సీఎం వైయ‌స్‌ జగన్ కృషి

ఒంగోలులో మంత్రి ఆదిమూల‌పు సురేష్‌

ఒంగోలు:  అన్ని కులాల ఆర్థిక స్వావలంభన కోసం సీఎం వైయ‌స్‌ జగన్ కృషి చేస్తున్నార‌ని మంత్రి ఆదిమూల‌పు సురేష్ తెలిపారు. నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో అన్నీ రంగాల్లో సాధికారత సాధించామని పేర్కొన్నారు. రాజకీయంగా అన్నీ వర్గాలను చెయ్యి పట్టుకుని నడిపించామని ఆయన వెల్లడించారు. గతంలో టీడీపీ హయాంలో ఎన్నికల సమయంలో మాత్రమే అణగారిన వర్గాలు గుర్తుకు వచ్చేవని విమ‌ర్శించారు.  సీఎం వైయ‌స్‌ జగన్ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే సాధికారిక యాత్ర చేప‌డుతున్న‌ట్లు మంత్రి చెప్పారు. ఏపీ పథకాలు పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయన్నారు. ఒంగోలులో నిర్వ‌హించిన సాధికార యాత్ర సంద‌ర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు.
 
చిట్ట చివరి కుటుంబానికి కూడా లబ్ది చేకూరే వరకు పథకాలు కొనసాగిస్తామని మంత్రి ఆదిమూల‌పు సురేష్ తెలిపారు. గతంలో కుట్ర పూరిత హామీలు గుప్పించిన చంద్రబాబు.. కులాల మధ్య చిచ్చుపెట్టాడంటూ మంత్రి మండిపడ్డారు. రాబోయే రోజుల్లో సరైన నిర్ణయం తీసుకుని వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డిని మరోసారి సీఎం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. నిజాయితీ, నిబద్ధతకు కేరాఫ్ అడ్రస్ సీఎం వైయ‌స్‌ జగన్ అంటూ ఆయన కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే స్థాయికి వెళ్ళారంటే అది సీఎం వైయ‌స్ జగన్ ఘనత అంటూ మంత్రి పేర్కొన్నారు. 

Back to Top