భాషా పండిట్‌ల‌ను చంద్ర‌బాబు ప‌ట్టించుకున్న పాపాన పోలేదు

- విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌

తెలుగు భాష మీద వ‌ల్ల‌మాలిన అభిమానాన్నిప్ర‌క‌టించే మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. తెలుగు భాషా పండిట్‌ల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోలేదు. 16 ఏళ్లుగా వాళ్లు ప్ర‌మోష‌న్లకు నోచుకోలేద‌ని తెలిసీ న్యాయం చేయ‌లేదు. మేం అధికారంలోకి వ‌చ్చిన ఆరు నెల‌ల్లోనే 12 వేల మందికి ప్ర‌మోష‌న్లు ఇచ్చాం. గ్రేడ్‌-2, హెచ్ ఎంలకు, స్కూల్ అసిస్టెంట్‌ల‌కు ప‌దోన్న‌తి క‌ల్పించాం. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల‌న్నింటినీ గుర్తించి స్టూడెంట్ టీచ‌ర్ రేషియో ప్ర‌కారం భ‌ర్తీ చేయ‌డం జ‌రుగుతుంది. ప్ర‌తి ఏటా జ‌న‌వరి మాసాన్ని ఉద్యోగాల క్యాలెండ‌ర్ నెల‌గా ప్ర‌క‌టించిన విష‌యాన్ని ప్ర‌భుత్వం గుర్తెర‌గాలి. త్వ‌రలోనే అక‌డ‌మిక్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్లను కూడా నియ‌మిస్తాం.

Read Also: ప్రభుత్వ పాఠశాలలకు వాచ్‌మెన్‌లను ఏర్పాటు చేయాలి

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top