ప్రభుత్వ పాఠశాలలకు వాచ్‌మెన్‌లను ఏర్పాటు చేయాలి

 మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

వచ్చే సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతున్నందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారికి కృతజ్ఞతలు. ఇది చాలా గొప్ప విషయంగా అందరూ భావిస్తున్నారు. మెగా డీఎస్సీ కాకుండా, ప్రతి సంవత్సరం జనవరి నెలలో అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు, విద్యాశాఖలోనూ భర్తీలు చేసేందుకు ఖాళీల భర్తీ క్యాలెండర్ ఏర్పాటు చేస్తామనడం కూడా గొప్పవిషయం. సుమారు 7000 కుపైగా ఉన్న విద్యావాలంటీర్ల భర్తీకి చర్యలు తీసుకోవడం అంత కరెక్టు కాదని భావిస్తున్నాం. రెగ్యులర్ టీచర్ల నియామకానికి ఇది ఇబ్బంది కావచ్చని విద్యాశాఖామంత్రి గారిని కోరుతున్నాము. గుంటూరు జిల్లాకు సంబంధించి 1300 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో గణితం, సోషల్, సైన్స్, హిందీ, తెలుగు సబ్జెక్టు బోధించే పోస్టులు ఎక్కువగా ఖాళీ ఉన్నాయి. అలాగే విద్యా సంస్థల్లో నాన్‌ టీచింగ్ స్టాఫ్ సరిపడా లేకపోవడం కూడా ఇబ్బందిని కలిగిస్తున్న అంశం. క్లర్కుల ఖాళీలను కూడా భర్తీ చేయమని మంత్రిగారికి విన్నవిస్తున్నాం. స్కూళ్లకు వాచ్‌మెన్ లేకపోవడం వల్ల అసాంఘిక కార్యక్రమాలకు పాఠశాలలు అడ్డాగా మారుతున్నాయి. వాటిని నిరోధించడానికి ప్రతి స్కూల్ కు ఒక నైట్ వాచ్‌మెన్ ఉండేలా చర్యలు తీసుకోమని కోరుతున్నాం. నేను 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం చదివాను. కానీ ఇంటర్ గుంటూరు ఏసీ కాలేజీలో ఇంగ్లీష్ మీడియం ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం తీసుకోవడంతో మొదటి సంవత్సరం మాక్స్, ఫిజిక్స్ ఫెయిల్ అవ్వడం జరిగింది. పదవ తరగతి వరకూ తెలుగు మీడియంలో చదువుకుని ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్లేసరికి అర్థం కాక ఇబ్బందులు పడిని పరిస్థితి నావరకూ నేను స్వయంగా చూసాను. నాకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితి ఇంకొకరికి రాకూడదనే అనుకుంటున్నాను. 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మనవాళ్లూ దే బ్రీఫ్డ్ మీ అని వచ్చీరాని ఇంగ్లీష్ తో మాట్లాడే పరిస్థితులు రాబోయే రోజుల్లో ఎవ్వరికీ రాకూడదు. అందరూ కూడా ఇంగ్లీష్ బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ముఖ్యమంత్రిగారు తీసుకున్న నిర్ణయాన్ని మరొక్కసారి హర్షిస్తూ, వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి భర్తీలు కూడా పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. స్కూళ్లు ప్రారంభం అయ్యే రోజుకల్లా విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్‌లు, యూనీఫామ్, షూలు అందుబాటులో ఉండాలని గౌరవ ముఖ్యమంత్రిగారు ఆదేశాలు జారీ చేసారు. అమ్మ ఒడి అమలు చేయడంతో పాటు స్కూల్ ప్రారభం అయ్యే నాటికే ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు లేకుండా చూసుకునే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాము. జాతీయ విద్యా విధానం 2019 ప్రకారం , అలాగే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్న విషయం 2025కల్లా ప్రతి పిల్లవాడు బడికి వెళ్లాలని, 2030కల్లా భారతదేశం 100శాతం అక్షరాస్యత సాధించాలనే లక్ష్యం చేరుకోవాలని చెబుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు అడుగులు వేస్తున్న సందర్భంగా విద్యా వ్యవస్థలో ఏ చిన్న లోపం కూడా ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. 

 

Read Also: ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేసింది వైయ‌స్ జ‌గ‌న్ ఒక్క‌రే

Back to Top