రాజ్యాంగ పదవికి చేటు తెచ్చిన వ్యక్తి నిమ్మగడ్డ

మంత్రి కొడాలి నాని
 

విజ‌య‌వాడ‌:  ప్ర‌తిప‌క్ష నేత చంద్రబాబు ఆదేశాలు అమలు చేసి..  రాజ్యాంగ పదవిలో ఉండి ఆ పదవికి చేటు తెచ్చిన వ్యక్తి నిమ్మగడ్డ ర‌మేష్ కుమార్ అని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు నేప‌థ్యంలో ఇప్పటికైనా నైతిక బాధ్యతతో  నిమ్మగడ్డ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుతో వ్యాక్సినేషన్ క్యార్యక్రమంతో ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ప్రభుత్వం చూస్తోందని, త్వరలోనే కోవిడ్ వారియర్స్‌కి  వ్యాక్సిన్ ఇచ్చి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు.  పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేయాల‌ని సీఎస్, ఆరోగ్య శాఖ కార్యదర్శి, అధికారులు వెళ్లి చెప్పినా  పట్టించుకోలేదని,  ప్రజలు ఏమైపోయినా  తన పదవి అయిపోయే లోపు ఎన్నికలు పెట్టాలని నిమ్మగడ్డ చూశారని మండిపడ్డారు. ఇప్పుడు 'హైకోర్టు తీర్పు కుక్క ​కాటుకు చెప్పు దెబ్బలా, నిమ్మగడ్డ మూతి పళ్లు రాలేలా తీర్పు వచ్చింది' అని మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.   కోవిడ్ ప్రబలి ప్రజలు చనిపోయి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని నిమ్మగడ్డ చూశారని మంత్రి ఆరోపించారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top