సిఎం చొరవతో '' ఎయిమ్స్" లో  డయానా కు వైద్య చికిత్స 

 న్యూ ఢిల్లీ ఏయిమ్స్ లో డయానా శాంతి వైద్య సేవలు కోసం ఉదారంగా సిఎం స్పందన 

మరో రూ.2 లక్షలు మంజూరు చేయాలని సిఎం ఆదేశం

ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆర్థిక సహాయం తో పాటు ఉద్యోగం కల్పించాం..

నేడు సిఎం ను కలిసి ధన్యవాదాలు తెలిపిన డయానా తల్లిదండ్రులు 

తూర్పు గోదావ‌రి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చొర‌వ‌తో చిన్నారి డ‌యానా శాంతికి న్యూఢిల్లీలోని ఏయిమ్స్ ఆసుప‌త్రిలో వైద్య సేవ‌లు అందుతున్నాయి.  నిడదవోలు శెట్టిపేటకు చెందిన రెండేళ్ళ డయానా శాంతి "స్పైనల్‌ మస్క్యులర్‌" వ్యాధితో బాధపడతూ  ఆపాప తల్లిదండ్రులు జనవరి 3 న ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు రాజమహేంద్రవరం వచ్చిన సందర్భంగా తగిన సహాయం అందించాల్సినదిగా విజ్ఞప్తి చేసినట్లు కలెక్టర్ డా. కె. మాధవీలత బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో తక్షణం స్పందించి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు రూ. లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయ‌డంతో పాటు, నెలకూ రూ. 10 వేల పెన్షన్, అవుట్ సోర్సింగ్ కింద డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. డయానా శాంతి ఆరోగ్య పరిస్థితి విని స్పందించిన ముఖ్యమంత్రి "ఎయిమ్స్" లో తగిన వైద్య సేవలు అందచేసేందుకు చొరవ తీసుకోవడం జరిగిందనీ కలెక్టర్ పేర్కొన్నారు.

నేడు నిడదవోలు కు ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంలో  డయానా తల్లి సూర్యకుమారి సిఎం ను కలిసి ధన్యవాదాలు తెలియ చేశారు.  ఈ సందర్భంగా తన కుమార్తె వైద్య సేవల కోసం న్యూ ఢిల్లీ కి వెళ్లి రావడం చాలా ఖర్చుతో కూడుకున్నట్లు సిఎం కు తెలియ చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వ పరంగా సహాయం అందచెయ్యడం జరుగుతుందని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి, వైద్య సేవల కోసం న్యూ ఢిల్లీకి వెళ్లి రావడానికి అవసరమైన చేయూతను అందచేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఇందుకోసం రూ.2 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించడం జరిగిందని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. ఐదు నెలల పాటు ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.  యు ఎస్ ఎ నుంచి పాప వైద్యానికి సంబంధించి రిస్డిప్లం   (risdiplam) IT gene therapy ఇంజెక్షన్ ఇవ్వవలసి ఉంటుందన్నారు. ఈ ఇంజెక్షన్ సుమారు రూ.14 కోట్ల రూపాయల ఖరీదు ఉన్న నేపథ్యంలో అందులో భాగంగా కొద్ది నెలలపాటు  పాప వైద్య పరీక్షలు చెయ్యవలసిన అవసరం ఉందన్నారు. తగిన వైద్య సేవలు పొందేందుకు వీలుగా న్యూ ఢిల్లీకి వెళ్లి రావడం కోసం విమాన ప్రయాణం ఖర్చులు , వసతి తదితర ఖర్చుల తగిన ఆర్థిక సహాయం చేయడం ఆదేశాలు ఇచ్చారన్నారు. ఆమేరకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కే. మాధవీలత తెలిపారు

Back to Top