విశాఖ: ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు పరిపాలనా రాజధానిగా విశాఖకు అనుకూలమా వ్యతిరేకమా సమాధానం చెప్పాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండు చేశారు. సెప్టెంబర్ నుంచి విశాఖ వేదికగా పరిపాలన జరుగుతుంది..సీఎం వైయస్ జగన్ రాకను ఎవరు అడ్డుకోలేరన్నారు. ముఖ్యమంత్రిగా సీఎం పరిపాలనను ఎక్కడ నుంచి అయినా నిర్వహించవచ్చు. వ్యవస్థలన్నీ ఇక్కడి నుంచే పని చేస్తాయన్నారు. ఇందులో ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. సీఎం వైయస్ జగన్ వైజాగ్ సెప్టెంబర్ లో కూడా రారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వచ్చే నెల మూడో తేదీన భోగాపురం ఎయిర్ పోర్ట్ కు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎప్పుడైనా ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించారా? అని మంత్రి ప్రశ్నించారు.