వైయ‌స్ఆర్ సీపీ నుంచి మ‌న్నెమాల సుకుమార్‌రెడ్డి స‌స్పెండ్‌

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు పొట్టిశ్రీ‌రాములు నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మ‌న్నెమాల సుకుమార్‌రెడ్డిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు ఫిర్యాదులు అందిన నేప‌థ్యంలో పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ సిఫార్సుల మేర‌కు మ‌న్నెమాల సుకుమార్‌రెడ్డిని స‌స్పెండ్ చేశారు. ఈ మేర‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. 

Back to Top