గంజి చిరంజీవి వైయ‌స్‌ఆర్ సీపీలో చేరిక‌

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరిన  మంగ‌ళ‌గిరి టీడీపీ ఇన్‌చార్జ్‌

తాడేప‌ల్లి:  తెలుగు దేశం పార్టీ మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ గంజి చిరంజీవి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమ‌వారం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో గంజి చిరంజీవి వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. చిరంజీవికి  పార్టీ అధినేత‌ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా గంజి చిరంజీవి మాట్లాడుతూ..సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలోనే రాష్ట్రాభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. అణగారిన వర్గాల అభివృద్ధికి సీఎం వైయ‌స్ జగన్ కృషి చేస్తున్నార‌ని చెప్పారు. సీఎం వైయ‌స్ జగన్‌ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయ‌న్నారు. టీడీపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌ర్గాల‌కు ఎలాంటి ప్రాధాన్య‌త లేద‌ని, ఆ పార్టీలో అల‌సిపోయి, విసుగు చెందామ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ త‌న‌ను అక్ర‌మ కేసులు పెట్టి వేధించినా ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డిన వైయ‌స్ జ‌గ‌న్ సొంతంగా పార్టీ పెట్టి..2019 ఎన్నిక‌ల్లో ఏకంగా 151 స్థానాల్లో ఘ‌న విజ‌యం సాధించి ముఖ్య‌మంత్రిగా ఎదిగార‌న్నారు. ఈ మూడేళ్ల‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌కు ఆక‌ర్శితుడ‌నై వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్నాన‌ని చెప్పారు. వైయ‌స్ జగన్ సారథ్యంలో శక్తివంచన లేకుండా పని చేస్తామ‌ని చెప్పారు. చేనేతలను సామాజికంగా, ఆర్థికంగా..రాజకీయంగా ఆదుకున్న ఏకైక ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని కొనియాడారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top