తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ బలోపేతమే లక్ష్యంగా అందరూ పని చేయాలని పార్టీ నాయకులకు వైయస్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక నేతలతో జూమ్ సమావేశం నిర్వహించి పార్టీ భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీని బలోపేతం చేసే దిశగా అందరికీ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో, గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆర్గనైజేషన్‌ను మరింత సమర్థవంతంగా నిర్మించాలని సూచించారు. గతానికి భిన్నంగా గ్రామ, వార్డు స్థాయిలో డెమోక్రటిక్ విధానంలో కమిటీల ఏర్పాటు చేపట్టడం ద్వారా సభ్యుల్లో ఓనర్‌షిప్ భావన పెంచాలని తెలిపారు. సభ్యత్వాన్ని కేవలం లిస్టులకే పరిమితం చేయకుండా, ఎంపికైన వారికి ఐడీ కార్డులు ఇవ్వడం ద్వారా బాధ్యతలు విస్తరించి వారిని ఎంపవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే... పార్టీ నిర్మాణ బలోపేతంపై కీలక దిశానిర్దేశం – సమన్వయంతో పనిచేస్తేనే ఫలితాలు వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ గారు పార్టీని బలోపేతం చేసే దిశగా అందరినీ యాక్టివ్ చేస్తూ కీలక బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో, పార్టీ ఆర్గనైజేషన్ నిర్మాణం, కమిటీల ఏర్పాటు, కోఆర్డినేషన్ అంశాలపై కీలక సూచనలు ఇవ్వడం జరిగింది. గ్రాస్‌రూట్ స్థాయిలో కమిటీల ఏర్పాటు – తొలి పరీక్ష పార్టీ ఆర్గనైజేషన్‌ను పూర్తిగా కొత్తగా రూపొందిస్తూ, గ్రామం, వార్డు స్థాయిలో కమిటీల ఏర్పాటు ప్రారంభించడం ఒక కీలక దశగా ఉంటుంది. గతంలో లిస్టులు తయారు చేసి పంపించే విధానానికి భిన్నంగా, ఈసారి గ్రాస్‌రూట్ స్థాయిలో డెమోక్రటిక్ పద్ధతిలో జనరల్ బాడీల ద్వారా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ప్రతి సభ్యుడికి ఓనర్‌షిప్ భావన పెరగడంతో పాటు, నిర్ణయాలలో పాల్గొనే అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఐడీ కార్డుల ద్వారా బాధ్యతలు – ఎంపవర్‌మెంట్ లక్ష్యం సభ్యత్వం కేవలం లిస్టులకు పరిమితం కాకుండా, ఎంపిక చేసిన సభ్యులకు ఐడీ కార్డులు ఇవ్వడం ద్వారా భవిష్యత్‌లో బాధ్యతలను పెంచడం, వారిని ఎంపవర్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం వర్టికల్ స్ట్రక్చర్ – ప్రతి ఒక్కరూ కనెక్ట్ కావాలి జగన్ గారు ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ ఒక వర్టికల్ లైన్‌లా పనిచేస్తుందని, అందులో ప్రతి ఒక్కరూ కనెక్టింగ్ డాట్స్‌లా పనిచేయాలని సూచించారు. కోఆర్డినేషన్ సెక్రటరీలు కీలకంగా పనిచేస్తూ, పార్లమెంట్ అబ్జర్వర్లు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు తదితరులతో సమన్వయం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఫీల్డ్‌లో పనిచేయాలి – హెడ్ ఆఫీస్ ఎక్స్‌టెన్షన్‌గా వ్యవహరించాలి హెడ్ ఆఫీస్‌కు పరిమితం కాకుండా, ఫీల్డ్ స్థాయిలో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను విస్తరించాలని సూచించారు. మీరందరూ హెడ్ ఆఫీస్ ఎక్స్‌టెన్షన్‌లా పనిచేయాలి కమిటీల పురోగతి – డిజిటలైజేషన్ వివరాలు రాష్ట్రవ్యాప్తంగా కమిటీల్లో సుమారు 18 లక్షల సభ్యులు ఉండగా, ఇప్పటివరకు 13.16 లక్షల డేటా డిజిటలైజ్ అయిందని తెలిపారు. ఇందులో 12 లక్షల మంది గ్రామ, వార్డు కమిటీలకు చెందినవారే ఉన్నారు. వెరిఫికేషన్‌లో జాప్యం – స్పీడ్ అప్ అవసరం, ఇవన్నీ అధిగమించేందుకు ఐటీ, యూత్, సోషల్ మీడియా వింగ్స్ గ్రామాలకు వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. యూత్, సోషల్ మీడియా పాత్ర కీలకం గ్రామ స్థాయిలో సభ్యుల ఫోటో అప్‌లోడ్, డేటా ఎంట్రీ వంటి ప్రక్రియలను వేగవంతం చేయడానికి యూత్, స్టూడెంట్, సోషల్ మీడియా వింగ్స్ చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాలపై అప్రమత్తత – SIRపై దృష్టి ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఓటర్ల జాబితాలను కచ్చితంగా పరిశీలించాలని సూచించారు. పార్టీ అనుకూల ఓట్లను కాపాడుకోవాలి, కొత్త ఓటర్లను నమోదు చేయాలి, ఈ బాధ్యతను అనుభవం ఉన్నవారికి అప్పగించాలని తెలిపారు. సమన్వయం, వివేకం – విజయానికి మూలం ఓపెన్ మైండ్‌తో పని చేస్తే ఫలితాలు సులభంగా వస్తాయని పేర్కొన్నారు. స్థానిక అసంతృప్తులను పట్టించుకోకుండా ఆధిపత్య ధోరణితో కాకుండా సమన్వయంతో పనిచేస్తే పార్టీ బలోపేతం అవుతుందని సూచించారు. పిరమిడ్ స్ట్రక్చర్ అమలు – నిరంతర పర్యవేక్షణ అవసరం పార్టీ నిర్మాణం పిరమిడ్ స్ట్రక్చర్‌లో సక్రమంగా అమలవుతోందా లేదా అన్నది ప్రతి స్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు.