ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని నీచ రాజకీయాలు

ఎమ్మెల్యే మల్లాది విష్ణు
 

 విజయవాడ: టీడీపీ నేతలు ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని నీచ రాజకీయాల చేస్తున్నార‌ని ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు మండిప‌డ్డారు. రెండు విడతల వైఎస్సార్‌ ఆసరాకు సంబంధించిన రూ.60 కోట్లు మహిళల ఖాతాలో జమ చేశామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్‌ సింగ్‌ నగర్‌లోని 58, 59, 60వ డివిజన్‌లకు సంబంధించిన వైఎస్సార్‌ ఆసరా చెక్కులను శనివారం ఎమ్మెల్సీ కరిమున్నీసా, డిప్యూటీ మేయర్‌ శైలాజా రెడ్డితో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 'చంద్రబాబు గతంలో జన్మభూమి కమిటీల పేరుతో మహిళలను మోసం చేశాడు. టీడీపీ నేతలు ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని నీచ రాజకీయాల చేస్తున్నారు. సింగపూర్, మలేషియా, పోలవరం యాత్రల పేరుతో చంద్రబాబు ప్రజాధనం దుర్వినియోగం చేశారు. గతంలో చంద్రబాబు రూ. 2 లక్షల కోట్లు అప్పులు చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్ అవినీతి రహిత పాలన అందిస్తున్నారు. అమ్మ ఒడి గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు లేదు' అని మల్లాది విష్ణు అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top