సీఎం వైయ‌స్‌ జగన్‌ను కలిసిన మేజర్‌ జనరల్‌

 అమరావతి : భారత ఉప ప్రాంతీయ సైనికాధికారి మేజర్‌ జనరల్‌ శ్రీనివాసరావు గురువారం ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. వైయ‌స్ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ రాష్ట్రాలకు ఉప ప్రాంతీయ కమాండింగ్‌ జనరల్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. ఇలా ఉప ప్రాంతీయ సైనికాధికారి నూతనంగా పదవి స్వీకరించిన ముఖ్యమంత్రులను మర్యాదపూర్వకంగా కలవడం అనేది ఒక ఆనవాయితీ. 
 

Back to Top