బీసీలను బ్యాక్‌బోన్‌ క్లాస్‌లుగా గుర్తించిన ఏకైక సీఎం వైయ‌స్ జగన్‌

బీసీల సంక్షేమంలో ఆయన నిర్ణయాలు ఎందరికో ఆదర్శం

వైయ‌స్ఆర్‌సీపీ నేతల వెల్లడి

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి కార్యక్రమం 

పూలే విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు 

బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత మూర్తి పూలే

ఆయన ఆశయాలు ఆచరణలో చూపిన ఘనత జగన్‌గారిది

వైయ‌స్ జగన్‌ తన నిర్ణయాలతో అభినవ పూలేగా గుర్తింపు పొందారు

పూలే వర్థంతి కార్యక్రమంలో గుర్తు చేసిన పార్టీ నేతలు

తాడేపల్లి:  బీసీలను బ్యాక్‌బోన్‌ క్లాస్‌లుగా గుర్తించిన ఏకైక ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చ‌రిత్ర‌లో నిలిచార‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు పేర్కొన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వ పాల‌న‌లో బీసీల సంక్షేమంలో ఆయన నిర్ణయాలు ఎందరికో ఆదర్శమ‌ని వెల్ల‌డించారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి జీవితాంతం పాటు పడిన మహోన్నత మూర్తి మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్థంతిని తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆర్‌.రమేష్‌యాదవ్, మాజీ మంత్రి జోగి రమేష్‌ తదితరులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

 ఎమ్మెల్సీ ఆర్‌.రమేష్‌యాదవ్‌ ఏమన్నారంటే..:
– బీసీలను బ్యాక్‌బోన్‌ క్లాస్‌లుగా గుర్తించిన ఘనత వైయ‌స్‌ జగన్‌గారిది. ఆనాడు బలహీనవర్గాల కోసం అహర్నిశలు పని చేసిన మహాత్మా జ్యోతీరావు పూలే ఆశయాలను ఆచరణలో పెడుతూ, బీసీలను బ్యాక్‌బోన్‌ క్లాస్‌లుగా గుర్తించిన ఘనత జగన్‌గారికి దక్కుతుంది.
– తరతరాలుగా వెనుకబాటుతనంతో ఉన్న బీసీ కులాలకు సామాజిక న్యాయం అందించాలనే లక్ష్యంతో తన అయిదేళ్ళ పాలనలో వైయ‌స్ జగన్‌గారు బీసీలకు పెద్దపీట వేశారు. బీసీలకు నిజమైన న్యాయం జరిగింది అంటే అది ఒక్క వైయ‌స్ జగన్‌గారి పాలనలోనే.
– బీసీ సామాజికవర్గానికి చెందిన నాకు కడప జిల్లా నుంచి చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం కూడా జగన్‌ గారి వల్లే సాధ్యపడింది.  

అభినవ పూలే వైయస్‌ జగన్‌: జోగి రమేష్, మాజీమంత్రి.
– రాష్ట్రంలో బీసీల సంక్షేమానికి, సామాజిక న్యాయానికి చిత్తశుద్దితో కృషి చేసిన  వైయస్‌ జగన్‌ అభినవ పూలేగా బీసీ వర్గాల్లో అభిమానం సంపాదించుకున్నారు. 
– క్యాబినెట్‌లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చోటు కల్పించిన గొప్ప నాయకుడు జగన్‌ గారు. 57 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ప్రతి కులానికి సరైన ప్రాతినిథ్యం కల్పించారు.
– సామజిక న్యాయం కోసం చిత్తశుద్దితో కృషిచేసి, పలువురు సీఎంలకు ఆదర్శంగా నిల్చారు. ఆయన వల్లే బీసీలకు మళ్లీ మంచి రోజులు వస్తాయి.
    పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, లిడ్‌క్యాప్‌ మాజీ ఛైర్మన్‌ రాజశేఖర్, పార్టీ గ్రీవెన్స్‌సెల్‌ ఇన్‌ఛార్జ్‌ నారాయణమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Back to Top