జాతిపిత మ‌హాత్మా గాంధీకి ఘ‌న నివాళి 

వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాల‌యంలో మ‌హాత్ముడి వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జాతిపిత మ‌హాత్మా గాంధీ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రై మ‌హాత్మా గాంధీ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి ఘ‌న నివాళుల‌ర్పించారు. అనంత‌రం వారు మాట్లాడుతూ.. గాంధీజీ క‌ల‌లు క‌న్న గ్రామ స్వ‌రాజ్యాన్ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ స్థాపించార‌న్నారు. మ‌హ‌నీయుల స్ఫూర్తితో నేడు ఏపీలో పాల‌న సాగుతోంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. 

Back to Top