పోటెత్తిన వినుకొండ‌ 

వినుకొండలో మేమంతా సిద్ధం – సీఎం రోడ్‌ షో

జనసంద్రంగా మారిన ప్రధాన రహదారి

రహదారికి ఇరువైపులా బారులు తీరిన జనం

పల్నాడు జిల్లాకు చేరుకున్న మేమంతా సిద్ధం యాత్ర.. 

ప‌ల్నాడు:  ముఖ్యమంత్రి వైయ‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప‌ల్నాడు జిల్లాకు చేరుకుంది. వినుకొండ‌కు చేరిన వైయ‌స్ జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌కు జ‌నం పోటెత్తారు.  చీకటీగల వారి పాలెం దగ్గర ప్రకాశం జిల్లా నుంచి పల్నాడు జిల్లాలోకి వైయ‌స్‌ జగన్ బస్సు యాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా బస్సు యాత్రలో పాల్గొన్న సీఎం  వైయ‌స్‌జగన్ కు పల్నాడు జిల్లా వైయ‌స్ఆర్‌ సీపీ క్యాడర్ అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. ఈ యాత్రకు భారీగా ప్ర‌జ‌లు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. చీకటి గల వారి పాలెం నుంచి వినుకొండ శివయ్య స్తూపం వరకు సీఎం వైయ‌స్ జగన్ రోడ్ షో నిర్వహిస్తున్నారు.  

కిక్కిరిసిన వినుకొండ‌
సీఎం వైయ‌స్ జ‌గ‌న్ రాక‌తో వినుకొండ కిక్కిరిసింది. ప్ర‌ధాన ర‌హ‌దారికి ఇరువైపు జ‌నం బారులు తీరి అభిమాన నేత‌కు అడుగడుగునా హారతులు పట్టి, దిష్టితీసి, దీవెనలందించారు. బస్సు యాత్రగా వస్తున్న సీఎం వైయ‌స్ జగన్‌కు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ‘నువ్వే మళ్లీ సీఎం.. మేమంతా సిద్ధం’ అంటూ నినాదాలు హోరెత్తించారు. ముసలి, ముతక, చిన్నాపెద్దా తేడాలేకుండా అభిమాన నేతను చూసి తరించారు. సెల్ఫీలు దిగి సంతోషంతో ఉప్పొంగి పోయారు. కరచాలనానికి పోటీపడ్డారు. దారిపొడవునా పూల వర్షం కురిపించారు. గుండెగుడిలో గూడుకట్టుకున్న అభిమానాన్ని రంగరించి ఆత్మీయతను పంచారు.  
వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక పలు సంక్షేమ పథకాలను అందుకుంటున్న అనేక మంది లబ్ధిదారులు బస్సు యాత్రలో దారి పొడవునా జననేతకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. అప్యాయంగా పలుకరిస్తూ ‘నువ్వు సల్లగా ఉండాలి నాయనా’ అంటూ దీవించి ముందుకు సాగనంపుతున్నారు.
 
  

Back to Top