గవర్నర్‌ను కించపరిస్తే సహించాలా..?

ప్రతిపక్ష సభ్యులపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం

టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్‌ చేసిన స్పీకర్‌

అసెంబ్లీ: శాసనసభను సజావుగా జరగనివ్వకుండా, సభలో గందరగోళం సృష్టిస్తున్న టీడీపీ సభ్యులు, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని సభ నుంచి సస్పెండ్‌ చేశారు. అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రతిపాదనల మేరకు పయ్యావుల కేశవులు, రామానాయుడు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై ఈ బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్‌ వేటు వేశారు. అదే విధంగా మిగిలిన కొంత‌మంది టీడీపీ సభ్యులపై ఒక్కరోజు సస్పెషన్‌ వేటు వేస్తూ స్పీకర్‌ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. 

ఈ సందర్భంగా స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యవస్థలను అవమానించడం పద్ధతి కాదన్నారు. శాసనసభకు తలవంపులు రాకూడదన్నారు.  గవర్నర్‌ను కించపరిస్తే సహించాలా..? అని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటామని, ప్రివిలేజ్‌ కమిటీ ఎదుట వీడియో ప్రదర్శిస్తాం. తప్పుడు ప్రచారాలపై తప్పకుండా చర్యలుంటాయని హెచ్చరించారు.  
 

Back to Top