లారస్‌ ల్యాబ్స్‌ యూనిట్‌–2 ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్‌లో లారస్‌ ల్యాబ్స్‌ యూనిట్‌–2ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.  లారస్‌ ల్యాబ్‌ ప్రాంగణానికి చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రూ.421.70 కోట్లతో నిర్మించిన లారస్‌ ల్యాబ్‌ను సీఎం వైయస్‌ జగన్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ ల్యాబ్స్‌ యూనిట్‌ ద్వారా 600 మందికి ఉపాధి లభించనుంది. అదే విధంగా లారస్‌ ల్యాబ్స్‌ కొత్త పరిశ్రమకు సీఎం వైయస్‌ జగన్‌ భూమి పూజ చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ వెంట లారస్‌ ల్యాబ్స్‌ యాజమాన్య బృందం, వైయస్‌ఆర్‌ సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఉన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top