‘జగన్‌ గెలిస్తే ప్రతి ఒక్కరు గెలిచినట్టే’

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కాకినాడ రూరల్‌ అభ్యర్థి కురసాలు కన్నబాబు

 
కాకినాడ: పేద ప్రజలకు మేలు జరిగే ప్రతి పథకాన్ని చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కాకినాడ రూరల్‌ అభ్యర్థి కురసాలు కన్నబాబు విమర్శించారు. కాకినాడ రూరల్‌ ఇంద్రపాలెంలో జరిగిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచార సభలో కన్నబాబు ప్రసంగించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు పసుపు-కుంకుమ ఇచ్చిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. ఎన్నికలకు మూడు నెలల ముందు మాత్రమే చంద్రబాబుకు ప్రజల ప్రేమ పట్టుకోస్తుందని ఆరోపించారు. ఎన్నికలు ముగిశాక చంద్రబాబు ప్రజలను పట్టించుకోరని పేర్కొన్నారు. కానీ రాష్ట్రంలో వైయస్‌ జగన్‌ గెలిస్తే ప్రతి ఒక్కరు గెలిచినట్టేనని తెలిపారు. రాజన్న రాజ్యం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని అన్నారు. వైఎస్‌ జగన్‌ పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని మండిపడ్డారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  కాకినాడ ఎంపీ అభ్యర్థి వంగా గీతా మాట్లాడుతూ.. వ్యవసాయం పండగ కావాలంటే.. వైయస్‌ జగన్ అధికారంలోకి రావాలని అన్నారు. ప్రజలు ఆలోచించి సంక్షేమ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అర్హత ఆధారంగా సంక్షేమ పథకాలు అందాలని అన్నారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే.. వైయస్‌ జగన్‌ రావాలని పేర్కొన్నారు. అందరికీ ఆరోగ్య భద్రత వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని తెలిపారు. రాజన్న రాజ్యం వైయస్‌ జగన్‌ తీసుకువస్తారని వ్యాఖ్యానించారు. పోలరం ప్రాజెక్టును సజీవంగా ఉంచిన వ్యక్తి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి మాత్రమేనని గుర్తుచేశారు. ప్రజల కోసం పనిచేసేవారినే ప్రజలు ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. 
 

Back to Top