మంత్రి గౌతమ్‌రెడ్డితో కైనెటిక్‌ గ్రీన్‌ సీఈఓ భేటీ

అమరావతి: రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో ‘కైనెటిక్‌ గ్రీన్‌’ సీఈఓ భేటీ అయ్యారు. ఏపీలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, రీచార్జ్‌ యూనిట్ల ఏర్పాటుపై మంత్రి గౌతమ్‌రెడ్డితో కైనెటిక్‌ గ్రీన్‌ సీఈఓ చర్చించారు. ద్విచక్ర, త్రిచక్ర ఎలక్ట్రిక్‌ వాహనాల మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌తో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల రీచార్జ్‌ స్టేషన్లు నెలకొల్పడంపై ఆసక్తి చూపుతున్నట్లు వివరించారు. ఎలక్ట్రానిక్‌ పాలసీలో విద్యుత్‌ వాహనాల తయారీకి ప్రాధాన్యత ఇస్తున్నామని, పర్యావరణానికి హాని లేని విద్యుత్‌ వాహనాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top