వైయ‌స్ఆర్ జిల్లాలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం 

ఇడుపుల‌పాయ‌: నేటి నుంచి రెండు రోజులపాటు పులివెందుల నియోజకవర్గం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం వైయ‌స్ఆర్‌ కడప జిల్లాకు చేరుకున్నారు. క‌డప‌ఎయిర్‌పోర్టు, ఇడుపుల‌పాయ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.  కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 4.20 గంటలకు ఇడుపులపాయ వైయ‌ఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, పార్టీ నేత‌లు స్వాగ‌తం ప‌లికారు. ఇడుపుల‌పాయ‌లో 4.50 గంటల వరకు పార్టీ నేతలతో మాట్లాడారు. ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ రాత్రి బస చేస్తారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top