బీటీపీ పేరు చెప్పి బాబు దగా చేసాడు  

కాపు రామచంద్రారెడ్డి
 

అసెంబ్లీ:  భైరవాని తిప్ప ప్రాజెక్టు రాయదుర్గంలో ఉంది. దానికి నీళ్లొస్తే కళ్యాణ దుర్గం, రాయదుర్గం రెండికీ వస్తాయి. అవిరెండూ కవల పిల్లలు. నేను పుట్టింది కళ్యాణ దుర్గం, ఎమ్మెల్యేగా ఉన్నది రాయదుర్గం. మహానాయకుడు రాజశేఖర్ రెడ్డిగారి కల భైరవానితిప్ప ప్రాజెక్టు. 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రామచంద్రా పరిస్థితి బాలేదు ఒక ఏడాది వదిలిపెట్టు. తర్వాత తప్పకుండా చేస్తాను అని మాటిచ్చారు. మహానుభావుడు ఆయన పోవడంతో ఇప్పుడు మా పరిస్థితి ఇంత దీనస్థితిలో ఉంది. ఇప్పుడు ఒక నమ్మకం వచ్చింది. వైయస్సార్ కొడుకుగా జగన్ మాకు న్యాయం చేస్తాడని నమ్ముతున్నాము. రాయదుర్గం ఏం పాపం చేసిందో తెలియదు, ఇరిగేషన్ అధికారులు అన్ని జిల్లాల్లో అన్ని చెరువులు నింపే పథకాలు పెట్టారు. కానీ రాయదుర్గంలో ఒక్క చెరువూ నింపడానికీ ఏ పథకాలు లేవు. రాయదుర్గంలో 60 చెరువులు ఉన్నాయి. వాటికి నీళ్లు నింపాలని కోరుకుంటున్నాం. 2014లో చంద్రబాబు వచ్చి నన్ను గెలిపించండి, గెలిచిన తక్షణమే బీటీపీ అన్నాడు. 2016 ఆగస్టులో మళ్లీ వచ్చాడు. వెంటనే బీటీపీ ప్రారంభిస్తున్నామని చెప్పి రెయిన్ గన్ల హడావిడి చేసి వెళ్లిపోయాడు. 2017 జులై లో ఏరువాక పౌర్ణమి కోసం వచ్చాడు. నాగలిపట్టి దున్నాడు. సాయంత్రానికి వెళ్లిపోయాడు. ఆ ఎద్దు కాస్త చచ్చిపోయింది. బీటీపీ మాత్రం రాలేదు. 2018 అక్టోబర్ లో మళ్లీ వచ్చాడు. 40,00,000 ఖర్చుపెట్టి భైరవాని తిప్ప ప్రాజెక్టుకు పసుపు రంగు వేసారు. 2 కోట్లు ఖర్చుపెట్టి పైలాన్ పెట్టి, ఎన్టీఆర్ బొమ్మపెట్టి గెస్టు హౌజ్ కట్టించాడు. దీనివల్ల మాకేంటి ప్రయోజనం. 2019 సంక్రాంతికల్లా నీళ్లిస్తా అని మాటిస్తున్నా అని చెప్పి వెళ్లాడు. సంక్రాంతి పోయింది, ఉగాది పోయింది ఎలక్షన్స్ వచ్చినాయి. ఈరోజుకీ ఏం చేయలేదు. మమ్మల్ని దగా చేసాడు, మోసం చేసాడు. ఈ రోజుకూ అక్కడ వలసలే. మహిళలు అక్కడ మాతంగిగా, జోగినీ, దేవదాశిలుగా ఉంటున్నవారి గతి పట్టించుకోలేదు. అక్కడ పరిస్థితులు చూస్తే మా కళ్లలో నీరు తిరుగుతాయి. బీటీపీకి చెందిన పొలాలకు 20ఏళ్లుగా నీళ్లు లేవు. కానీ రెవెన్యూ రికార్డుల్లో మాగాణి అని రాసారు. ఇన్‌పుట్ సబ్సిడీరాదు. ఇన్సూరెన్స్ రాదు. ఏమీ రాదు. మెట్టకు మాత్రమే ఇస్తారు. కనుక మమ్మల్ని ఆదుకోవాలని సీఎం జగన్ గారిని, ఇరిగేషన్ శాఖా మంత్రిని మరీ మరీ కోరుతున్నాం.
 

Back to Top