చంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!

వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు జూపూడి ప్రభాకర్ రావు 

కారంచేడు,చుండూరు,పదిరికుప్పం బాబు సామాజికవర్గ దాష్టీకాలే...!

కారంచేడులో ఏరులై పారింది దళితుల రక్తం కాదా..?

దళితుల్ని ముక్కలుగా నరికి శవాల్ని మూటగట్టిన రక్తచరిత్ర మీది కాదా...!

చంద్రబాబు పాలనలో దళితులకు అడుగడుగునా అవమానాలే! 

వైఎస్ కుటుంబానికి దళితులు బంధువులు-ఆత్మ బంధువులు! 

దళితులతో వియ్యమందిన చరిత్ర చంద్రబాబు, రామోజీ కుటుంబాలలో ఉందా?

తాడేప‌ల్లి: కారంచేడులోని దళితుల ఊచకోత చేసింది మీరే కదా అని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు జూపూడి ప్రభాకర్ రావు చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. రామోజీరావుకి కారంచేడు ఘటన కనిపించలేదా? అని ఆయ‌న నిల‌దీశారు. గురువారం జూపూడి ప్ర‌భాక‌ర్ మీడియాతో మాట్లాడారు.

జూపూడి ప్ర‌భాక‌ర్ ఏమ‌న్నారంటే..

భయంకర కుట్రలకు వేదిక ‘ఈనాడు’ః
పేదల పక్షాన నిలిచిన, పనిచేసిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. ఈ మాటను రాష్ట్రంలో ఉన్న ప్రతీ పేదకాలనీల్లోనూ అందరూ ఒప్పుకునే మాటనే. డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ గారి రాజ్యాంగ సూత్రాలను అమల్లోనూ.. ఆలోచనలోనూ ముందుకు తీసుకెళ్లిన నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారు ఒక్కరే. అలాంటిది. మా నాయకుడు జగన్‌ గారిపై ఇవాళ ఈనాడు దినపత్రిక ఓ వార్త ద్వారా విషం కక్కింది. దళితుల మీద కొత్త ప్రేమను ఒలకబోస్తూ ఓ కథనం రాసుకొచ్చింది. జగన్‌ గారికి దళితుల పట్ల వ్యతిరేకత ఉందంటూ.. ఆయన్ను దళితుల నుంచి దూరం చేయాలనే కుట్రకు దిగింది. అందులో భాగంగా చంద్రబాబు దళితుల ఆపద్భాందవుడంటూ విచిత్రమైన కథనాన్ని రాసుకొచ్చింది. ఈ వార్తను చదివి ప్రజలంతా నవ్వుకుంటున్నారు. 

చంద్రబాబు వళ్లంతా దళితుల రక్తమే కదా..?ః
చంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచిందని మరిచావా రామోజీ..? అని నిలదీస్తున్నాం. అన్నదమ్ములుగా బతుకుతున్న దళితుల్ని విడగొట్టింది చంద్రబాబు.  వారిలో మనస్పర్ధలు రెచ్చగొట్టి కోర్టులు కెక్కేలా చేసి దాడులకు ఉసిగొల్పింది చంద్రబాబు. ఈ విషయాలు ఈనాడు రామోజీరావుకు తెలియవా..? లేకుంటే, తెలిసి కూడా చంద్రబాబు నాయుడు చాలా మంచోడని.. దళితులకు దేవుడని రాశావా.? ఈ విధమైన రాతలపై దళిత నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పే శక్తి నీకుందో లేదో చూసుకో..

కారంచేడులో ఏరులై పారింది దళితుల రక్తం కాదా..?ః
కారంచేడులో దళితుల ఊచకోత ఎవరి హయాంలో జరిగింది..? నువ్వు అధికారంలోకి తెచ్చిన నాయకుల హయాంలోనే కదా..? ఆ ఊచకోతకు కోర్టుల్లో సాక్ష్యాలు, సమాధానాలు లేకుండా చేసిన దుర్మార్గమైన ఘనత కూడా మీదేకదా..? చంద్రబాబు సామాజికవర్గం మీద ఎదురు తిరిగారనే కారణంతో కక్షతో దళితుల్ని ముక్కలు ముక్కలుగా నరికి శవాలను మూట గట్టింది మీరు కాదా..? అప్పట్లో మాలమాదిగలు ఒకటైతే.. వారి ఉద్యమాలను తట్టుకోలేక విలవిల్లాడిన ఘటన మీదికాదా..? రక్తం ఏరులై పారింది కారంచేడులో కాదా.. ? ఈరోజు రాష్ట్రంలో, ఏ మూలనో, ఏ వ్యక్తిగత కారణాలతోనో, ఎక్కడ్నో జరిగిన చిన్న ఘటనల్ని తెచ్చి జగన్‌ గారి చేతులకు రక్తం పూస్తే.. మరి, ప్రత్యక్షంగా చంద్రబాబు వంటి నిండా అంటిన దళితుల రక్తాన్ని ఎవరు కడగాలి..? 

దళితుల్ని చంద్రబాబు గుర్రాలతో తొక్కిస్తే వార్త రాయలేదేం..?ః
అసలు, ఏనాడైనా మీరు దళితుల్ని మనుషులుగా చూశారా..? నేనిప్పుడు రామోజీరావును ఒక ప్రశ్న అడుగుతున్నాను. గడచిన 50 ఏళ్లల్లో ఈనాడు పుట్టిన దగ్గర్నుంచీ ఈ రాష్ట్రంలో దళితుల స్థితిగతులు వెనుకబడి ఉన్నాయని, వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాల్సిన అవసరం ఉందని వార్త రాశావా రామోజీ..? దళితుల అభ్యున్నతికి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగ హక్కుల్ని ప్రభుత్వాలు పాటించాలని ఏనాడైనా మీరు సూచిస్తూ వార్త రాశారా..? మీరు చెప్పకుంటే.. మీ సామాజికవర్గం మొత్తం మనిషులు అనే మాటను మరిచి కులం.. కులం అన్న మత్తులో, మీరంతా  కలిసి మాదిగ మాల పల్లెలపై పడి ఊచకోతలు కోయలేదా..? వీటన్నింటినీ మరిచారా?
మాదిగలు, మాలలు ఒక్కటైతే మీ ఉనికికి ప్రమాదమని మీరంతా కలిసి హైదరాబాద్‌లో మమ్మల్ని గుర్రాలతో తొక్కించలేదా..? ఆ గుర్రాల తొక్కిసలాటకు భయపడి ట్యాంక్‌బండ్‌ పైనుంచి దూకి మా దళితులు చనిపోలేదా..? మరి, ఈ ఘటనపై నీ ఈనాడులో ఒక్క వార్త రాశావా రామోజీ..? 

చుండూరు, పదిరికుప్పం మీచేతి రక్తపుమరకలేః
పోనీ, మీ కళ్లకు చుండూరు ఘటన కనిపించలేదా..? ఆనాడు, వేరే ప్రభుత్వం అధికారంలో ఉండొచ్చు గానీ మీరు  కనీసం ఖండించారా..? పదిరికుప్పం మీ సామాజికవర్గ అధ్యాయంలో పేజీ కాదా..? ఆయా ఘటనలు మీ చీకటి కోణాల్లోని రక్తపు మరకలు కావా..? ఇవాళ రాష్ట్రంలో ఉన్న దళితులంతా నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ జగన్‌మోహన్‌రెడ్డి గారు, వారిని అక్కునజేర్చుకుని అండగా నిలబడితే మీరు ఓర్చుకోలేకపోతున్నారా..? అందుకే, జగన్‌ గారి సైన్యంగా నిలిచిన దళితుల్ని బెదరగొట్టడం కోసం విషపు రాతలు రాస్తున్నావా..? ఎన్నడూ లేనివిధంగా నువ్వు దళితులపై కొత్తగా ప్రేమను ఒలకబోస్తున్నావంటే.. రామోజీ, నీ వయస్సుకైనా బుద్ధుండాలి కదా..? కాటికి కాలు చాపిన వయస్సులోనూ నువ్వు పదేపదే తప్పులు చేస్తున్నావే.. నీ దాష్టీకాలను కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని తెలుసుకో.. 

చంద్రబాబు పాలనలో దళితులకు ఎన్నో అవమానాలుః
చంద్రబాబు పరిపాలనలో దళితులను ఉద్దేశించి ఎంత నీచంగా మాట్లాడారో ప్రజలంతా చూశారు. చెవులారా విన్నారు. దళితులు మురికిగా ఉంటారు. వాళ్ల పక్కన కూర్చొంటే వాసన వస్తుందని మాట్లాడిన జమ్మల మడుగు మంత్రి బాబు పరిపాలనలో కాదా..? ఆరోజు చంద్రబాబు తన మంత్రిని ఏమన్నా మందలించాడా..? టీడీపీ ఎమ్మెల్యే ఒకరేమో.. రాజకీయాలు మాలమాదిగలకు ఎందుకురా..? మేం తేల్చుకుని మేం ఏలుబడి చేస్తాంరా..? అంటూ అవమానించలేదా..? ఆయన ఇదే బాబు దగ్గరున్న సీనియర్‌ ఎమ్మెల్యే అవునా.. కాదా.? ఎక్కడికెళ్లింది మీ గురివింద గింజ మచ్చని ప్రశ్నిస్తున్నాం. 

దళితులతో వియ్యమందిన చరిత్ర మీకు ఉందా?
దళితులను అక్కునజేర్చుకుని అమితంగా ప్రేమగా చూపిస్తున్న కుటుంబం ఆది నుంచి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారి కుటుంబం ఒక్కటే. ఆయన కుటుంబంలో తన నలుగురు మేనత్తలు దళితుల్ని పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆరోజుల్లోనే కులనిర్మూలన జరగాలంటే, బీఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగ సూత్రాల్ని బట్టి రాజారెడ్డి గారు తన బిడ్డల్ని ఎస్సీలకు ఇచ్చి పెళ్లిచేశారు. మరి, చంద్రబాబు కుటుంబంలో అలాంటి పరిస్థితి ఉందా..? దళితులతో మీరు వియ్యమందిన సందర్భాలున్నాయా..? రామోజీ.. నీ ఇంట్లో ఒక ఎస్సీ, ఒక ఎస్టీ కోడలు గానీ ఉన్నారా..? ఎక్కడ మీ ఆస్తులు పోతాయోననే భయంతో మేనరికాలు చేసుకోవడమే గానీ.. ఎస్సీలను వివాహమాడిన చరిత్ర ఉందా..? సమాధానం చెప్పండి. 

చంద్రబాబు రక్తంలోనే దళిత వ్యతిరేకతః
చంద్రబాబుకు దళితులంటేనే గిట్టని వ్యవహారం. ఆయన మాకు చేసిన మేలేం లేదు. ఆయన రక్తంలోనే ఎస్సీ, ఎస్టీలపై వ్యతిరేకత ఉంది. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా.. అని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని నోరుపారేసుకున్నాడు. అంటే, ఆ స్థాయి వ్యక్తినే అంత మాటన్నప్పుడు ఎస్సీలు ఆత్మగౌరవంతో ఎలా బతకగలరనే కనీస ఆలోచన చేయకుండా మాట్లాడే స్వభావం ఆయనది. బీసీల తోకలు కత్తిరిస్తానన్నాడు. ఇలాంటి వ్యక్తి నీచత్వాన్ని పక్కనబెట్టి .. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ పేదలకు అండగా ఉండే జగన్‌గారిని విమర్శిస్తూ మీడియాలో రాతలు రాస్తే ప్రజలు వారి మాయరాతల్ని నమ్మరు. 

చంద్రబాబూ.. నీ డ్రామాలాపితే మంచిదిః
చంద్రబాబూ.. నీ డ్రామాలు ఆపితే మంచిది. కూటమి పేరిట మీ విన్యాసాలన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీ కూటమి ముక్కలై బద్ధలై ఓటు ట్రాన్స్‌ఫర్‌ కాక.. మీరు పక్కనతెచ్చుకున్న నటుడు స్టేజీలపై తలక్రాప్‌ ఎగరేసి నటిస్తుంటే నువ్వు చూస్తూనే ఉన్నావుగా..? కాపు సోదరులు మీ కూటమి వైపు ఉన్నారని అనుకుంటున్నారా..? కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం గారు ఎటువైపు నిలబడ్డారో మీకు తెలియడం లేదా..? నీకూ బీజేపీకి మధ్య బ్రోకర్‌ కాదా అతను. ఏమయ్యా రామోజీ.. మీ బ్రోకర్‌ పవన్‌కళ్యాణ్‌కు కూటమి సర్దుబాటులో 21 స్థానాలుంటే.. దళితులకు ఎన్ని సీట్లు ఇచ్చాడో వార్త రాయలేదేం..? 

అదే కణతకు తగిలి ఉంటే..ః
ఆనాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారిని చూసి ఎందుకు భయపడ్డావు..? ఇప్పుడు నీ కొడుకంత వయస్సు గల జగన్‌మోహన్‌రెడ్డి గారిని చూసి అన్నీ తడుపుకుంటున్నావుగా..? అందుకే, నిన్న విజయవాడలో ఆయన్ను హత్య చేయాలని చూశారు. జగన్‌ గారి నుదిటి భాగంలో రాయి తగిలింది కాబట్టి సరిపోయింది. అదే కణతకి తగిలుంటే ఆయన మనకి ఉండేవారు కాదుగదా..? పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో మీ కుట్ర మొత్తం తేలుతుంది. దీని వెనుక చంద్రబాబు ఉన్నాడు. ఆయన నిలబెడుతున్న ఎమ్మెల్యే అభ్యర్థులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వారే చెప్పకనే చెబుతున్నారు. ఇక కాచుకోండి. మీ భరతం పడతాం. 

దళితులను ఇంకా ఎంతకాలం తొక్కుతారు?
పేదల రక్తంతో అగ్రవర్ణాల అస్తుల్ని పెంచుకుంది మీరు కాదా..?. దళితుల ఆకలి ఏంటో.. మా హృదయంలో దుఃఖమేంటో మీకు తెలుసా..? మా దళితులను మీరు ఇంకా ఎంతకాలం తొక్కాలని చూస్తారు..? ఇంకా మామీద, మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునే వారిపై ఎన్నెన్ని విషపు రాతలు రాయాలని చూస్తారు..? రాష్ట్రంలో పేద వర్గాలకు డీబీటీ ద్వారా రూ.2.75 లక్షల కోట్లు జగన్‌మోహన్‌రెడ్డి గారు ముఖ్యమంత్రి గా పంచిపెట్టారు. అదే చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో ఏనాడైనా పేద వాళ్లకు ఒక్క పైసా విదిలించాడా..? పేదల రక్తంతో మీ అగ్రవర్ణాల ఆస్తులు పెంచుకున్నారు కాదా..? ఈ మాట నిజం కాదా..? ఇప్పటికైనా నీ రోత రాతల్ని మానుకోకపోతే చాలా దెబ్బతింటావని రామోజీరావుకు హెచ్చరిక చేస్తున్నాను. 

ఎస్సీ, ఎస్టీలంతా జగన్‌ గారి వైపే ఉన్నారుః
సామాజిక న్యాయ సూత్రాలను అమలు చేస్తోన్న ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే. నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ దళితవాడల్లో అభివృద్ధి ఫలాల్ని పూయిస్తున్న ఆయన పక్షానే రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలున్నారు. దళితుల అభ్యున్నతికి పాటుపడుతూ.. పేద కుటుంబాల్లో పిల్లల చదువు ఖరీదు కాకూడదని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చి వారికి ఇంగ్లీషు మీడియం విద్యాబోధన చేయించిన ప్రభుత్వం మాది. వైద్య, ఆరోగ్య విషయంలోనూ ఎన్నడూ ఊహించని విధంగా గ్రామస్థాయిలో మార్పు చెందిన మరో విప్లవం జగన్‌ గారి హయాంలోనే జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్‌ విగ్రహాన్ని నిర్మించిన జగన్‌గారిని మరిచిపోయే దళితులు ఎవరైనా ఉంటారా..? ఇళ్లస్థలాల పంపిణీలో గానీ, తమ బిడ్డల చదువు, యువతకు ఉపాధిలోనూ, వృద్ధులకు పింఛన్ల రూపంలోనూ ఎస్సీఎస్టీలంతా జగన్‌మోహన్‌రెడ్డి గారిని దేవుడిగా కొలుస్తున్నారు. కనుకే,  రేపటి ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలు గెలవబోతున్నాం. పెత్తందార్ల పార్టీలు, పత్రికలు మూతపడక తప్పవు. 

Back to Top