8న ప్రపంచ వ్యాప్తంగా వైయ‌స్ఆర్ జయంతి వేడుకలు

మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌
 

విశాఖపట్నం: ఈ నెల 8న ప్రపంచ వ్యాప్తంగా దివంగత మహానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. గురువారం ఆయన వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. వైయ‌స్ఆర్ జయంతి వేడుకల నిర్వహణపై చర్చించారు. 

అనంతరం గుడివాడ అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే  వైయ‌స్ జగన్ సమీక్ష మొదలు పెట్టారని.. నియోజక వర్గ స్థాయిలో నాయకులతో సమావేశాలు పెట్టే ఆలోచన అధిష్టానం చేస్తుందని తెలిపారు. ప్రజల పక్షాన ఎప్పడూ వైయ‌స్ఆర్‌సీపీ నిలబడుతుంది. ప్రజలకు అండగా వైయ‌స్ జగన్ నిలబడతారు. వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రజలకు మేలు జరిగింద‌ని అమర్‌నాథ్‌ అన్నారు.

కార్యకర్తలు, నాయకుల కష్టాలను వైయ‌స్ జగన్ దృష్టికి తీసుకువెళతాము. 99 శాతం హామీలు అమలు చేసిన వైయ‌స్ఆర్‌సీపీకి ప్రజల్లో అభిమానం ఉంటుంది. కూటమి ప్రభుత్వం హనీమూన్ ముగిసిన తర్వాత మా యాక్షన్ ఉంటుంద‌ని గుడివాడ అమర్‌నాథ్‌ వ్యాఖ్యానించారు.

 

Back to Top