పవన్ కళ్యాణ్ కు షాక్..   

మంత్రి కొట్టు సత్యనారాయణ సమక్షంలో వైయ‌స్ఆర్‌ సీపీలో చేరిన జనసేన నాయకులు

ప‌శ్చిమ గోదావ‌రి:  జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఆ పార్టీ నాయ‌కులు షాకిచ్చారు. మంత్రి కొట్టు సత్యనారాయణ సమక్షంలో  జనసేన నాయకులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.  మంత్రి జ‌న‌సేన నాయ‌కుల‌కు కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా  మంత్రి కొట్టు నారాయణ మాట్లాడుతూ..  పవన్ కల్యాణ్ కు ఎవరి నుంచైనా ప్రాణహాని ఉందంటే.. అది కేవలం చంద్రబాబు నుంచే అని  పేర్కొన్నారు.  అసలు.. పవన్ ను హత్య చేస్తే ఎవరికి లాభం? అని ఆయన ప్రశ్నించారు. ”పవన్ కల్యాణ్.. నువ్వు అన్నట్లు నీకు నిజంగానే ప్రాణహాని ఉన్నట్లు నీకు వేగుల ద్వారా సమాచారం ఉంటే.. నీ ఆరోపణలు నిజమే అయితే, చంద్రబాబు నుంచే నీకా ప్రమాదం ఉంది” అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

 సీఎం వైయ‌స్ జగన్ అందిస్తున్న సంక్షేమ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. కొందరు రాజకీయంగా తమ పని అయిపోయిందని భయంతోనే వైయ‌స్ జగన్ రహిత పాలన కావాలని నినాదంతో వెళ్తున్నారు. నిజానికి చంద్రబాబు రహిత పాలన రావాలి. అది వైయ‌స్‌ జగన్ వల్లే సాధ్యం అవుతుంది. రాష్ట్రాన్ని దోచుకోవడం కోసం తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని చంద్రబాబు వాడుకున్నారు. లక్షల కోట్లు సంపాదించారని విమ‌ర్శించారు.

Back to Top