వైయ‌స్ఆర్ సీపీలో చేరిన జ‌న‌సేన నేత‌లు

విశాఖ‌ప‌ట్నం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో జ‌న‌సేన పార్టీ నేత‌లు వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. శ్రీ శార‌దా పీఠం వార్షిక మ‌హోత్స‌వాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను జ‌న‌సేన పార్టీకి చెందిన ఎం. నాగ‌మ‌ణి, అప్పారావులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి.. సీఎం స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి వారికి వైయ‌స్ఆర్ సీపీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

Back to Top