వైయ‌స్ఆర్ సీపీలో చేరిన జ‌న‌సేన నేత రామ్‌సుధీర్‌

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో కృష్ణా జిల్లా పెడ‌న నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన జ‌న‌సేన నేత యడ్లపల్లి రామ్‌సుధీర్ వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. సుధీర్‌తో పాటు స్థానిక జ‌న‌సేన నాయ‌కులు యడ్లపల్లి లోకేష్‌, పొల‌గాని ల‌క్ష్మీనారాయ‌ణ‌, మ‌ద్దాల ప‌వ‌న్‌, తోట జ‌గ‌దీష్‌, ప్ర‌సాద్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ స‌మక్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. ఈ మేర‌కు వారికి కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. 

Back to Top