కాసేపట్లో ‘జగనన్న తోడు’ పథకం ప్రారంభం

తాడేపల్లి: మేనిఫెస్టోలో చెప్పిన మరో వాగ్దానానికి వైయస్‌ జగన్‌ ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. చిరువ్యాపారులకు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి అండగా.. వారి ఉపాధికి ఊతం ఇస్తూ ‘జగనన్న తోడు’ పథకాన్ని మరికాసేపట్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించనున్నారు. దాదాపు 10 లక్షల మంది చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున బ్యాంకుల ద్వారా సుమారు రూ.1000 కోట్ల వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. తన పాదయాత్రలో చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారు పడుతున్న కష్టాలు చూసి చలించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌.. ఆ కష్టాల నుంచి వారికి విముక్తి కలిగించేందుకు జగనన్న తోడు పథకాన్ని తీసుకువచ్చారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top