జగనన్న క్రీడా సంబరాల 2022 పోస్టర్ ఆవిష్కరణ 

నెల్లూరు: జగనన్న క్రీడా సంబరాలు - 2022 పోస్టర్ ను మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ఆవిష్కరించారు. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో  మంత్రి మాట్లాడుతూ..  స్పోర్ట్స్ ను ప్రోత్సహించే దిశగా క్రీడా ప్రాధికార సంస్థ పనిచేస్తుందని, యువత చదువుతో పాటు క్రీడలపై కూడా అధిక ఆసక్తిని చూపించాలన్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాస్) ఆధ్వర్యంలో క్రీడా రంగానికి తగిన ప్రాధాన్యత కల్పించి, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న క్రీడా సంబరాలు పేరుతో ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు  తెలిపారు.  జగనన్న క్రీడా సంబరాలలో కబడ్డీ, వాలీబాల్‌, బ్మాడ్మింటన్‌, క్రికెట్‌ పోటీలను  తొలుత నియోజకవర్గ, జిల్లా, జోన్‌ స్థాయిలో పూర్తి చేస్తార‌న్నారు. డిసెంబర్‌ 20, 21 తేదీల్లో రాష్ట్ర స్థాయి పోటీలు ఉంటాయన్నారు. విజేతలకు రూ.50 లక్షల విలువైన బహుమతులు అందజేస్తామన్నారు.  

తాజా వీడియోలు

Back to Top