వైయ‌స్‌ జగన్ సంక్షేమ పాలనపై ప్రజలంతా సంతృప్తి

జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి అపూర్వ స్పందన

ఎమ్మెల్యే తొగూరు ఆర్థ‌ర్‌

నందికొట్కూరు:  జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి ప్ర‌జ‌ల నుంచి అపూర్వ స్పందన ల‌భిస్తుంద‌ని, సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనపై ప్రజలంతా సంతృప్తిగా ఉన్నట్లు ప్ర‌జా మ‌ద్ద‌తు స‌ర్వేలో వెల్ల‌డ‌వుతోంద‌ని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగూరు ఆర్థ‌ర్ తెలిపారు.  నందికొట్కూరులోని ఎమ్మెల్యే  క్యాంపు కార్యాలయంలో జగనన్నే మా భవిష్యత్తు, జగనన్నే మా నమ్మకం కార్యక్రమంపై  శాసనసభ్యులు తొగురు ఆర్థర్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలిచారని  తెలిపారు.  ఇటీవల నిర్వహించిన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి అపూర్వ స్పందన వచ్చిందన్నారు.  తాజాగా వెలువడిన ఓ సర్వేలో 2024 ఎన్నికల్లో 25కి 24 ఎంపీ స్థానాలు గెలిచి వైయ‌స్ఆర్‌సీపీ విజయకేతనం ఎగురవేస్తుందని తెలపడంతో ప్రతిపక్షాలకు నిద్రపట్టడం లేదన్నారు. గతంలో కూడా ఇదే సంస్థ సర్వే చేసి చెప్పిన విధంగానే ఫలితాలు రావడంతో ప్రస్తుతం ఇతర పార్టీల్లో భయం పుట్టిందన్నారు. తమ ప్రభుత్వంలో చెడు కనిపించకపోవడంతో వారి అనుకూల మీడియాలో ఇష్టమొచ్చినట్లు పచ్చరాతలు రాయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే తాము నిర్వహించే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చి స్వయంగా పరిశీలించుకోవచ్చని తెలిపారు.  స‌మావేశంలో  రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్  గంగిరెడ్డి రమాదేవి , రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్  హాజీ అబ్దుల్ సుకూర్, నందికొట్కూరు సింగిల్ విండో చైర్మన్ సగినేల. ఉసేనయ్య , బ్రాహ్మణ కొట్కూరు సింగిల్ విండో చైర్మన్ మద్దూరి హరి సర్వోత్తమ్ రెడ్డి, నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల.రబ్బాని గారు, కౌన్సిలర్ మొల్ల జాకీర్ హుస్సేన్, నందికొట్కూరు పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వనజ, మాజీ కౌన్సిలర్  శ్రీనివాసులు,  నాయకులు తమ్మడపల్లె విక్టర్, విశ్రాంత పోలీసు అధికారి జాన్ , ముజీబ్, మహేష్ ,వెంకటేష్, బూసి గౌడు, చిట్టి రెడ్డి,ఉదయ్, సుజిత్ రెడ్డి, అశోక్ రెడ్డి, వెంకటస్వామి, వలి భాష, పాములపాడు మండల కన్వీనర్ శ్రీముడియాల వెంకటరమణారెడ్డి గారు, ఎర్రగూడూరు మురహరి రాజన్న, స్వామిదాసు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top