వైయ‌స్ జ‌గ‌న్ సార‌థ్యంలో అవినీతి ర‌హిత స‌మాజం

రాజ‌కీయాల‌కు అతీతంగా వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వ పాల‌న

వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌మాణాస్వీకారం చారిత్ర‌క ఘ‌ట్టం

వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కురాలు కిల్లి కృపారాణి

శ్రీకాకుళం : వైయ‌స్ఆర్‌ కుటుంబం పట్ల ఉన్న జనాద‌రణకు ఈ ఫలితాలు నిదర్శనమని వైయ‌స్ఆర్‌సీపీ నాయకురాలు కిల్లి కృపారాణి పేర్కొన్నారు.సోమ‌వారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయటం చారిత్రక ఘట్టం అని తెలిపారు. 50శాతం ఓట్ షేర్‌ సాధించటం ఎవరికీ సాధ్యంకాలేదని వెల్ల‌డించారు.  డయాలసిస్‌ చేసుకుంటున్న కిడ్నీ రోగులకు 10వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం హర్షణీయమన్నారు.  

మద్యం అమ్మకాల నియంత్రణకు, బెల్ట్ షాప్‌ల నిర్మూలన పట్ల ప్రకటన చేయడం అభినందనీయమన్నారు. అవినీతి రహిత సమాజానికి సీఎం వైస్‌ జగన్ ఇచ్చిన పిలుపునకు ప్రజలందరూ కట్టుబడి ఉండాలని కోరారు. జన్మభూమి కమిటీల మాఫీయాకు చరమగీతం పాడి, సంక్షేమ‌ పథకాలు రాజకీయాలకు అతీతంగా అర్హులకు ఇస్తామని తెలిపారు. గ్రామ సచివాలయాల్లో వాలంటీర్ల నియామకం ద్వారా లక్షా అరవైవేల మందికి ఉపాధి లభించనున్నదని పేర్కొన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఏపీ ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసి బుద్ధి చెప్పారన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top