శ్రీ‌వ‌కుళ‌మాత ఆల‌య ప్రారంభోత్స‌వానికి సీఎంకు ఆహ్వానం

తాడేప‌ల్లి: శ్రీ వ‌కుళ‌మాత ఆల‌య ప్రారంభోత్స‌వానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, టీటీడీ ఆల‌య ఈవో ధ‌ర్మారెడ్డి ఆహ్వానించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను మంత్రి పెద్దిరెడ్డి, టీటీడీ ఈవో ఏ.వీ.ధ‌ర్మారెడ్డి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా తిరుప‌తి పేరూరు (పాత‌కాల్వ) స‌మీపంలో నిర్మించిన శ్రీ‌వ‌కుళ‌మాత ఆల‌య ప్రారంభోత్స‌వానికి ఆహ్వానించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆహ్వాన‌ప‌త్రిక అందించిన అనంత‌రం టీటీడీ వేద పండితులు తిరుమ‌ల శ్రీ‌వారి ప్రసాదాలు, వస్త్రం అందజేసి వేద ఆశీర్వచనం అంద‌జేశారు. ఈ నెల 18న అంకురార్పణంతో మొదలై 23 వరకు వివిధ రకాల పూజా కార్యక్రమాలు, 23న మహా సంప్రోక్షణ ఆవాహన, ప్రాణ ప్రతిష్ఠ కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి.

Back to Top