బంగారం తరలింపుపై విచారణ జరిపిస్తాం

త్వరలోనే టీటీడీ నూతన పాలక మండలి ఏర్పాటు

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

తిరుమల:శ్రీవారి ఆభరణాల భద్రతపై ఉన్న అపోహలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు.ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ గత పాలక మండళ్లు సభ్యులు రాజీనామా చేయకపోవడంతో ఆర్టినెన్స్‌ ద్వారా తొలగించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందన్నారు.టీటీడీలో అభివృద్ధికి ఆటంకం కలగకుండా త్వరలోనే నూతన పాలక మండలి ఏర్పాటు చేస్తామని తెలిపారు.బంగారంపై తరలింపుపై విచారణ జరిపిస్తామని..ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.వంశపారంపర్యంగా వస్తున్న అర్చకత్వంపై సమస్యలు ఉన్నాయని వాటిని తర్వలోనే పరిష్కరిస్తామన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top