కాసేపట్లో అగ్రికల్చర్‌పై మేధోమథన సమీక్ష

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘మన పాలన – మీ సూచన’పై నిన్నటి నుంచి మేధోమథన సమీక్షా సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపై మేధోమథన సమీక్ష కాసేపట్లో ప్రారంభం కానుంది. వైయస్‌ఆర్‌ రైతు భరోసా, ఆర్‌బీకేలు, రైతులకు 9 గంటల విద్యుత్, జనతా బజార్లు, ధరల స్థిరీకరణ నిధి, కొనుగోలు కేంద్రాలు తదితర అంశాలపై రైతు సంఘాల ప్రతినిధులు, నిపుణులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్చించనున్నారు.

Back to Top