మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తేదీలు ఖరారు

అమరావతి:  మార్చి, ఏప్రిల్ నెల‌ల్లో నిర్వ‌హించే ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాల అమ‌లు తేదీల‌ను ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. బుధ‌వారం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ రెండు నెల‌ల్లో అమ‌లు చేసే కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాల‌పై ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. అసెంబ్లీ సమావేశాలు, మార్చి, ఏప్రిల్‌ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలుచేయాల్సిన పథకాల తేదీల ఖరారు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా నిలిచిపోయిన పలు కార్యక్రమాలు. ఎన్నికల కోడ్‌ ముగియనుండడంతో ఈ కార్యక్రమాలు, పథకాల అమలుకు ప్రభుత్వం సన్నాహాలు. 

  • ఎన్నికల కోడ్‌తో సంబంధం లేని కారణంగా మార్చి 10 నుంచి మధ్యాహ్న భోజనంతోపాటుగా రాగిజావ అమలు ప్రారంభం. 
  • మార్చి 14 నుంచి అసెంబ్లీలో సమావేశాల నిర్వహణకు నిర్ణయం.
  • బీఏసీ సమావేశంలో సమావేశాల షెడ్యూలు ఖరారు. 
  • మార్చి 18 సంపూర్ణ ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం… జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటి పద్ధతిలో నగదు జమ. 
  • మార్చి 22న ఉగాదిరోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్ల ప్రకటన. వీరికి ఏప్రిల్‌ 10న అవార్డులు, రివార్డులు.
  • మార్చి 23న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం.
  • మార్చి 25 నుంచి వైయస్సార్‌ ఆసరా. ఏప్రిల్‌ 5 వరకూ కొనసాగనున్న కార్యక్రమం. 
  • మార్చి 31న జగనన్న వసతి దీవెన.
  • ఏప్రిల్‌ 6న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ అమలు. 
  • ఏప్రిల్‌ 10న వాలంటీర్లకు సన్మానం. 
  • ఏప్రిల్‌ 18న ఈబీసీ నేస్తం.
  •  
Back to Top