ఏపీ పోలీసుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లు

ఐసీజేఎస్‌లో దేశంలోనే రెండో స్థానం కైవసం
 

తాడేప‌ల్లి: ఆంధ్ర్ర ప్ర‌దేశ్ పోలీసు శాఖ మ‌రో రికార్డు సృష్టించింది. ఇంట‌ర్ ఒపెర‌బుల్ క్రిమిన‌ల్ జ‌స్టిస్ సిస్ట‌మ్‌(ఐసీజేఎస్‌) అమ‌లు చేయ‌డం, వినియోగంలో జాతీయ స్థాయిలో ఏపీ పోలీసులు రెండో స్థానాన్ని కైవ‌సం చేసుకున్నారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం కేంద్ర ప్ర‌భుత్వం అవార్డులు ప్ర‌క‌టించింది. దేశంలో రూల్ ఆఫ్ లా అమలులో ఇది అత్యంత  కీలక భాగం.పారదర్శకత, జవాబుదారీతనం, సత్వర న్యాయాలకు గీటురాయి. దీంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఆన్ లైన్ ద్వారా డీజీపీ గౌతం స‌వాంగ్  అవార్డును అందుకున్నారు. ప్రతిష్టాత్మకమైన అవార్డు ను పోలీస్ శాఖ దక్కించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసి ముఖ్యమంత్రి వైచ‌స్ జగన్ మోహన్ రెడ్డి, హోం మంత్రి మేకతోటి సుచరిత అభినంద‌న‌లు తెలిపారు. ఐసీజేఎస్ అమలు, వినియోగంలో మహారాష్ట్ర మొదటి స్థానం, ఆంధ్ర ప్రదేశ్ 2వ స్థానం, తెలంగాణ 3వ స్థానంలో నిలిచాయని కేంద్రం ప్ర‌క‌టించింది.
 

Back to Top