పేదల అభ్యున్నతి కోసం పాటుపడే ప్రభుత్వం ఇది

మంత్రి తానేటి వనిత 
 

అమరావతి: తమ ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం పాటుపడే ప్రభుత్వమని, ప్రజలందరికీ సామాజిక న్యాయం చేస్తోన్న సంక్షేమాభివృద్ధి ప్రభుత్వమని రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. శుక్రవారం అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి ఆమె ఆత్మీయ స్వాగతం పలికారు. సభా కార్యక్రమానికి ముందు సీఎం జగన్‌తో కాసేపు మాట్లాడారు.

ఈ సందర్భంగా కొవ్వూరులో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ పర్యటన విజయవంతం కావడం, సభలో నియోజకవర్గ అభివృద్ధికి సీఎం హామీల గురించి మరోసారి చర్చించి ఆయనకు  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కాగా, బుధవారం సీఎం పర్యటన సందర్భంగా వచ్చిన అర్జీల పట్ల అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి 24 గంటల్లోనే గురువారం రోజున బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ చేశామని ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఇంత త్వరిత గతిన సమస్యలకు పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి ఎవరూ లేరని ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

అలాగే, నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిన విజ్ఞప్తి మేరకు డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి రూ.30 కోట్లతో పాటు 3 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, కొవ్వాడ కెనాల్ వద్ద కల్వర్ట్, మూడు మండలాల్లో మూడు అంబేడ్కర్ భవనాలు, ముస్లింలకు షాదీఖానా, ఎస్సీలకు కమ్యూనిటీ హాలు, కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి హామీ ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి జగన్‌కు  హోంమంత్రి వనిత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Back to Top