ప్రతీ కుటుంబంలో సంతోషాలను నింపడమే లక్ష్యం 

రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత

వైయస్‌ఆర్‌ నవశకం ప్రచార యాత్ర ప్రారంభం 

గుంటూరు: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో విప్లవాన్ని తీసుకువచ్చి ప్రతీ కుటుంబంలో సంతోషాలను నింపడమే వైయస్‌ఆర్‌ నవశకం కార్యక్రమం లక్ష్యమని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరులో శనివారం వైయస్‌ఆర్‌ నవశకం ప్రచార యాత్రను మంత్రులు మోపిదేవి వెంకటరమణ, హౌసింగ్‌ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, ఎమ్మెల్యేలు విడుదల రజినితో కలిసి హోం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ..ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి పథకానికి ప్రత్యేకంగా కార్డులను జారీ చేసి ఎక్కువ మంది ప్రయోజనం పొందేలా ఆదాయ పరిమితిని భారీగా పెంచడం జరిగిందని తెలిపారు. వాలంటీర్లు లబ్దిదారుల వివరాలను సేకరించి గ్రామసచివాలయాలలో లబ్దిదారుల జాబితాను ప్రదర్శించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియ అంతా ముగిసిన అనంతరం 2020 జనవరి 1 నుండి ప్రతీ పథకానికి ప్రత్యేక కార్డులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.  

Read Also: త్వరలో రచ్చబండ

Back to Top