ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి

ఎక్కడా పార్టీ ఓట్లు తొలగించకుండా జాగ్రత్త పడాలి

అవసరమైతే టాస్క్‌ఫోర్స్‌లా ఏర్పడి పని చేయాలి

ఈ ప్రక్రియలో పార్టీ బూత్‌ కమిటీలది కీలకపాత్ర

వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేట‌ర్‌ రామకృష్ణారెడ్డి స్పష్టీకరణ

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ బూత్‌ కమిటీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం

తాడేప‌ల్లి:  ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పార్టీ బూత్ క‌మిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ రామకృష్ణారెడ్డి సూచించారు. ఎక్కడా పార్టీ ఓట్లు తొలగించబడకుండా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని స్పష్టీకరించారు. సోమ‌వారం వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ బూత్‌ కమిటీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వ‌హించారు. పార్టీ జోనల్‌ ఇంఛార్జ్‌లు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, పార్టీ జిలా స్థాయి బూత్‌ కమిటీల అధ్యక్షులు ఈ స‌మావేశానికి హాజర‌య్యారు. రాష్ట్రంలో జరగనున్న ఓటర్ల జాబితా సవరణ.. ‘స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌–సర్‌)’పై సమాశంలో చర్చ. ఆ పేరుతో అధికార పక్షం చేసే అవవతకలు, అక్రమాలను అడ్డుకోవడంతో పాటు, ఎక్కడా పార్టీ ఓట్లు తొలగించకుండా చూడాల్సిన అవసరం, ఆ ప్రక్రియపై సమావేశంలో చర్చ. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన పార్టీ స్టేట్‌ కోఆర్డినేటర్  సజ్జల రామకృష్ణారెడ్డి బూత్ క‌మిటీ స‌భ్యుల‌కు దిశానిర్దేశం చేశారు.

పార్టీలో బూత్‌ కమిటీలది కీలకపాత్ర:
    మీరు చేయబోయే పని చాలా కీలకం. ఇటీవల సాంకేతిక పరిజ్ఞానం చాలా పెరిగింది. దాన్ని అన్వయించుకుని, మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు అదే టెక్నాలజీ మోసం చేయడానికి కూడా వినియోగపడుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, మనం చాలా అప్రమత్తంగా పని చేయాల్సి ఉంటుంది. ఆ దిశలో మీరంతా సన్నద్ధంగా ఉండాలి. ఉన్న ఓట్లు తీసివేయకుండా, అక్రమ ఓట్లు చేర్చకుండా చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. మనపార్టీ సానుభూతిపరుల ఓట్లు అక్రమంగా తొలగించకుండా చూడాలి.
    ఇప్పటికే తెలంగాణలో ఇంటింటి సర్వే జరుగుతుండగా, ఇక్కడ కూడా సచివాలయాల సిబ్బంది పని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
2019 ఎన్నికల మందు టీడీపీ ప్రభుత్వం అదే పని చేసింది. ఇంటింటికి వెళ్లి వారు వైయస్సార్‌సీపీ సానుభూతిపరులని తెలియగానే ఓట్లు తీసేశారు. అలా దాదాపు 40 లక్షల ఓట్లు తీసేస్తే, మనం పోరాడాల్సి వచ్చింది.

అవసరమైతే టాస్క్‌ఫోర్స్‌:
    ఇప్పుడు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. మన ఓటర్లను కాపాడుకోవాలి. వారి ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలి. అందుకు అవసరమైతే టాస్క్‌ఫోర్స్‌ కూడా ఏర్పాటు చేసుకుందాం. బూత్‌ లెవెల్‌ పరిధిలో నాయకులను ఈ ప్రక్రియలో ప్రమేయం చేయాలి. ఆ విధంగా రాష్ట్ర స్థాయి నుంచి కింది వరకు ఒక పక్కా వ్యవస్థ.. టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసుకుని, స్పెషల్‌ టాస్క్‌తో పని చేయాల్సిన అవసరం ఉందని, అలా అధికార పక్షం వారి ఆటలు సాగనీయకుండా లక్ష్యాన్ని సాధించుకోవాలని  సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

లేళ్ళ అప్పిరెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సెంట్రల్‌ ఆఫీస్‌ ఇంఛార్జ్‌

అధికార పార్టీ ఆగడాలు, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులను టార్గెట్‌ చేసి వేధిస్తున్న తీరుపై మనం మరింత అప్రమత్తంగా ఉండాలి, బూత్ కమిటీలు ఏ విధంగా పనిచేయాలని మనం విశ్లేషించుకుందాం. 2029 ఎన్నికల్లో ఏ విధంగా ముందుకుసాగాలనే దానిపై మనం ప్రధానంగా దృష్టిపెట్టాలి, ఓటర్‌ను పోలింగ్‌ కేంద్రం వరకూ తీసుకువెళ్లడం, మన ఓట్లను తొలగించకుండా కాపాడుకోవడం మన కర్తవ్యం. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన విధంగా గుర్తింపు వస్తుంది. మన పార్టీకి 16 లక్షల మంది నెట్‌వర్క్‌ను మనం ఏర్పాటు చేశాం. పార్టీ ఏ కార్యక్రమం చేసినా అందరూ భాగస్వామ్యం అయ్యేలా ఉండాలి. మన నాయకుడు వైయ‌స్‌ జగన్‌ గారి ఆశయాలు, ఆలోచనలతో మనం కలిసి ముందుకుసాగుదాం. రానున్నది మంచి కాలం, మనమంతా కష్టపడి పనిచేసి మళ్ళీ వైయ‌స్ఆర్‌సీపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేద్దామని అప్పిరెడ్డి పిలుపునిచ్చారు.

Back to Top