త్వరలో రచ్చబండ

2020 సంవత్సరంలో జనవరి లేదా ఫిబ్రవరి మాసంలో రచ్చబండ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల అమలు ఏ విధంగా ఉందో ముఖ్యమంత్రి స్వయంగా రచ్చబండ కార్యక్రమంలో ప్రజలనడిగి తెలుసుకుంటారు. ప్రజలు ఇచ్చే వినతుల ఆధారంగా అక్కడిక్కడే అధికారులకు ఆదేశాలిస్తారు.
సుపరిపాలనకు సాక్ష్యంగా
దమ్మున్న నాయకుడు. ఇచ్చినమాట తప్పని నేత. ప్రజలకు సేవ చేయడమే రాజకీయం అనే రాజకీయవేత్త వైయస్ జగన్. పరిపాలనలో కొత్త దృక్పధం, పనుల్లో పారదర్శకత, నిర్ణయాల పట్ల నిబద్ధత ఇవన్నీ ఉన్న నాయకుడు ప్రజల్లోకి వెళ్లడానికి ఆలోచించడు. నే చేసిన పాలన ఎలా ఉందో చెప్పండి...సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి అంటూ నిఖార్సుగా మాట్లాడే ఏకైక ముక్కుసూటి మనిషి వైయస్ జగనేనేమో! దాచిపెట్టడాలు, దాటవేతలూ లేవు. శిలాఫలకం వేస్తే రెండు వారాల్లో పని ప్రారంభం కావాల్సిందే అని ప్రకటించే గట్స్ చూసి అధికారులే నివ్వెరపోతున్నారు. తాత్సారాలు, నాన్చివేత ధోరణలు ఈ నాయకుడి దగ్గర పనికి రావు. పనిమాత్రమే మాట్లాడుతుంది. మన పాలనతోనే ప్రజలను గెలవగలం అంటున్న ఈ యువ నేత తన పనికి మార్కులు వేయించుకునేందుకు ప్రజల సమక్షానికి వెళ్లబోతున్నారు. అదీ పాలన చేపట్టిన ఆరునెలలకే. అదీ తెగింపంటే. అదీ తన పాలనపై తనకున్న విశ్వాసం అంటే. నిజంగా పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా? పక్కదారి పడుతున్నాయా? అధికారులు ప్రజలు మెచ్చేలా పనిచేస్తున్నారా? ప్రజా సమస్యల పట్ల సరైన రీతిలో స్పందిస్తున్నారా? క్షేత్ర స్థాయిలో పథకాల అమలు తీరు తెన్నులు ఎలా ఉన్నాయి? ఇవన్నీస్వయంగా తెలుసుకుని, లోపాలుంటే సరిదిద్దుకునేందుకే ముఖ్యమంత్రి రచ్చబండ ప్రారంభిస్తున్నారంటున్నారు సీనియర్ అధికారులు.
తన నాయకత్వాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రజాభిప్రాయాన్ని కోరుకోవడమే అసలైన నాయకుడి లక్షణం. అదే వైయస్ జగన్ విజయ రహస్యం అనుకోవచ్చేమో!

Read Also: సుజనా పచ్చి అబద్ధాల కోరు 

 

Back to Top