ఎమ్మిగనూరు రోడ్డు ప్రమాదంపై వైయస్ జగన్‌ విచారం

తాడేప‌ల్లి: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్ వద్ద రెండు కార్లు ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ అన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైయ‌స్ జ‌గ‌న్ కోరారు. 

Back to Top