మంత్రి పీఏ సతీష్‌ను అరెస్ట్‌ చేయాలి

 మాజీ మంత్రి పుష్పశ్రీవాణి డిమాండ్‌

పార్వ‌తీపురం జిల్లా: మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్‌పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్‌ చేయాలని మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి డిమాండ్‌ చేశారు. సతీష్‌పై కేసు నమోదు చేయకుండా నిందితుడి​​కి మంత్రి సంధ్యారాణి కొమ్ము కాయడం అన్యాయం. మంత్రి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలి. బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది.

 కేసును తారుమారు చేయకుండా నిష్పక్ష పాతంగా పోలీసులు విచారణ చేపట్టాలి. పోలీసులు విచారణ పూర్తి కాకుండా వాయిస్, వాట్సాప్ చాటింగ్ మార్ఫింగ్ అని మంత్రి ఎలా చెప్తారు. సీఎంవో నుంచి పీఏను తొలగించాలని ఆదేశాలు వచ్చిన తరువాతే పీఏను తొలగించడం నిజం కాదా?’’ అంటూ పుష్పశ్రీవాణి మండిపడ్డారు.

Back to Top