తిరుపతి: సుజనా పచ్చి అబద్ధాల కోరు అని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. సుజనా టీడీపీలో ఉన్నారా? బీజేపీలో ఉన్నారా అని ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తనతో టచ్‌లో ఉన్నారన్న సుజనా చౌదరి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తనతో టచ్‌లో ఉన్నది ఎవరో చెప్పాలని పట్టుబట్టారు. సుజనా చౌదరిని చంద్రబాబే బీజేపీలోకి పంపించారని, అందుకే ఆయన బాబుకు అనుకూలంగా పని చేస్తున్నారని ఫైర్ అయ్యారు. Read Also: మోసం చేయడంలోచంద్రబాబు దిట్ట