18 శాతం నేరాలు త‌గ్గుముఖం

హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌
 

తిరుప‌తి: గ‌తేడాది రాష్ట్రంలో నేరాల సంఖ్య 18 శాతం త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేక‌తోటి సుచ‌రిత పేర్కొన్నారు. తిరుప‌తిలో నిర్వ‌హించిన పోలీస్ డ్యూటీ మీట్‌లో ఆమె మాట్లాడుతూ..జాతీయ స్థాయిలో ఏపీ పోలీస్ శాఖ‌కు అనేక అవార్డులు వ‌చ్చాయ‌న్నారు.ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలను కొంత మంది ఓర్వలేక‌పోతున్నార‌ని మండిప‌డ్డారు. ఓర్వలేక కులాల మ‌ధ్య చిచ్చుపెట్టాల‌ని చూస్తున్నార‌ని ఆమె ధ్వ‌జ‌మెత్తారు. పోలీసుల‌పై బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నేరం ఎవ‌రూ చేసినా చ‌ట్టం త‌న ప‌ని తాను చేస్తుంద‌ని హెచ్చ‌రించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top