అభివృద్ధిని ఓర్వలేకనే చంద్రబాబు దొంగ ఉద్యమాలు

హోంమంత్రి మేకతోటి సుచరిత
 

గుంటూరు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేస్తున్న   అభివృద్ధిని ఓర్వలేకనే చంద్రబాబు ఇలా దొంగ ఉద్యమాలకు తెర తీశారని హోంమంత్రి మేకతోటి సుచరిత దుయ్యబట్టారు.  నరసరావుపేట సభలో ఆమె మాట్లాడుతూ.. రాజధానిపై చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారు. రాజధాని పేరిట శివరామకృష్ణన్‌ కమిటీ ఇచ్చిన నివేదికను చంద్రబాబు తుంగలో తొక్కారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేదే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని తెలిపారు. వైఎస్‌ జగన్‌ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకనే చంద్రబాబు ఇలా దొంగ ఉద్యమాలకు తెర తీశారని దుయ్యబట్టారు. సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు తమ మద్దతు తెలపాలని తాను కోరుతున్నట్లు స్పష్టం చేశారు.
 

Back to Top