పంచాయతీ ఫలితాలే మా పనితీరుకు దర్పనం

ఒక్కో ఇంటికి కనీసం 4 నుంచి 6 సంక్షేమ పథకాలు అందుతున్నాయి

మున్సిపల్‌ ఎన్నికల్లోనూ వైయస్‌ఆర్‌ సీపీదే విజయం

హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత

అమరావతి: పంచాయతీ ఎన్నికల ఫలితాలే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనితీరుకు దర్పనం అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ప్రజలంతా సీఎం వైయస్‌ జగన్‌ వెంటే ఉన్నారని స్పష్టమైందన్నారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. హోంమంత్రి సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన ఐదేళ్ల పరిపాలనలో ఒక్క పేదవాడికైనా ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. కానీ, సీఎం వైయస్‌ జగన్‌ 30 లక్షల మంది పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారని చెప్పారు. ఒక్కొక్క ఇంటికి కనీసం 4 నుంచి 6 సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. చంద్రబాబులా వ్యవస్థలను వాడుకోవడం తమకు చేతకాదన్నారు. పంచాయతీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ చెప్పారని, ఓటమిని జీర్ణించుకోలేక ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 
 

Back to Top