రథం తగలపడటం వెనుక కుట్ర కోణం దాగి ఉంది

త్వరలో నిజాలు నిగ్గు తేలుస్తాం

హోం మంత్రి మేకతోటి సుచరిత

 ప్రకాశం :  అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన ఘటనపై ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ వేసిందని, త్వరలో నిజాలు నిగ్గు తేలుస్తామని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు.  రథం తగలపడటం వెనుక కుట్ర కోణం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు.ప్రతి పక్షాల విమర్శలు చూస్తుంటే.. ఆ అనుమానాలు మరింత బలపడుతున్నాయన్నారు. ఏది ఏమైనా సీబీఐ ఎంక్వైరీలో అన్నీ తేలుతాయని.. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంతర్వేది ఘటనపై సీరియస్‌గా ఉన్నారని చెప్పారు. శుక్రవారం శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా పోలీస్ పాసింగ్ పెరేడ్‌లో సుచరిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా వైరస్‌పై సమరంలో పోలీసులు కీలకంగా పనిచేశారని తెలిపారు. వారి కోసం హెల్త్ క్యాంప్‌లు పెడుతున్నామని, దేశంలోనే తొలి సారిగా పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. ఏపీ పోలీసులు దేశ వ్యాప్తంగా మన్ననలు పొందుతున్నారని చెప్పారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అమరులైన పోలీసుల‌కు రూ. 50 లక్షల‌ భీమా కల్పించడం జరిగిందని సుచ‌రిత పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top