వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల‌పై లాఠీచార్జ్‌

 పశ్చిమ గోదావరి : ఉండి ఎమ్మార్వో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైయ‌స్ఆర్‌సీపీ అభిమానులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్‌ చేయటంతో పరిస్థితులు అదుపతప్పాయి.  శుక్రవారం వైయ‌స్ఆర్‌సీపీ, టీడీపీ కార్యకర్తలు అభ్యర్థుల వెంట నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనటానికి ఉండి ఎమ్మార్వో ఆఫీసు వద్దకు ఒకేసారి చేరుకున్నారు. దీంతో ఒకరికొకరు ఎదురుపడి పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఇరువర్గాలను చెల్లా చెదురు చేయటానికి పోలీసులు లాఠీ చార్జ్‌ చేయటంతో ఉద్రిక్తత నెలకొంది. అభ్యర్థి వెంట ఎక్కువ మంది రాకూడదంటూ వైయ‌స్ఆర్‌సీపీ అభిమానులపై, కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్‌ చేయటం గమనార్హం.

Back to Top