కోవిడ్‌ నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

తాడేపల్లి: కోవిడ్‌ నివారణ, కరోనా వాక్సిన్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. కోవిడ్‌ నివారణ చర్యలు, భవిష్యత్తు వ్యూహంపై సీఎం వైయస్‌ జగన్‌ ఉన్నతాధికారులతో చర్చించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, మున్సిపల్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీల‌క్ష్మీ, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం రవిచంద్ర, ఉన్నత విద్యా శాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీష్‌చంద్ర, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, పాఠశాల విద్య శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ.మల్లికార్జున్, సీఎంఆర్‌ఎఫ్‌ ప్రత్యేక అధికారి డాక్టర్‌ ఎం.హరికృష్ణతో పాటు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.  

Back to Top