విజయవాడ: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బిశ్వభూషన్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఏపీ హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సన్మానించారు.