గుర‌జాడ ఆడిటోరియాన్ని ప్రారంభించిన మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

విజ‌య‌న‌గ‌రం:  జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీకల్ యూనివర్సిటీ గురజాడ విజయనగరం ఆడిటోరియం ను  రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు  బొత్స సత్యనారాయణ (సత్తిబాబు) ప్రారంభించారు. శ‌నివారం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు)తో క‌లిసి మంత్రి  జవహర్ లాల్ నెహ్రు టెక్నాలజికల్ యూనివర్సిటీ గురజాడ లో ఏసీ ఆడిటోరియం, ఎగ్జామినేషన్ భవనమునకు  రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ (సత్తిబాబు) శంకుస్థాప‌న చేశారు. కార్య‌క్ర‌మంలో  రాజాం శాసన సభ్యులు కంబాల జోగులు, శాసన మండలి సభ్యులు  పెనుమత్స సూర్యనారాయణ రాజు (సురేష్ బాబు), యూనివర్సిటీ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు 

Back to Top