ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో నివాళుల‌ర్పించిన పార్టీ నేత‌లు

తాడేప‌ల్లి:      మాజి ఉపప్రధాని  బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలను పార్టీ నేతలు కొనియాడారు. నేటి తరానికి జగ్జీవన్ రామ్ మార్గదర్శిగా నిలిచారని అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జూపూడి ప్రభాకరరావు, జంగాకృష్ణమూర్తి, లేళ్ళఅప్పిరెడ్డి  పూలమాలలు వేసి  ఘనంగా నివాళులు అర్పించారు.

      శాసనమండలిలో పార్టీ ఛీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..   జగ్జీవన్  రామ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని అన్నారు.  మంత్రిగా ఒక శాఖను పూర్తిగా అర్ధం చేసుకుని,  నిర్వహించడమే కష్టమైన నేపథ్యంలో.. జగ్జీవన్ రామ్ గారు  40 ఏళ్ళపాటు 14 శాఖలకు మంత్రిగా పనిచేసి, ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. అన్ని శాఖలను అవగాహన చేసుకుని స్ఫూర్తిదాయకంగా పనిచేసి, దేశానికి మేలు చేసేవిధంగా ఆయన ఎన్నో సంస్కరణలు తెచ్చారన్నారు.  దేశంలో హరితవిప్లవం రావాలని ఆయన కోరుకుని దానికి అనుగుణంగా పనిచేశారన్నారు. జగ్జీవన్ రామ్ పట్టుదల వల్లే హరిత విప్లవం వచ్చిందన్నారు. దేశరక్షణ శాఖ మంత్రిగా దేశరక్షణలో ఆయన చూపిన తెగువ మరువలేనిదన్నారు. భారత ఉపప్రధానిగా కూడా ఆయన సమర్ధవంతంగా పనిచేశారన్నారు. జగ్జీవన్ రామ్ గారు నాడు తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని అన్నారు. అంబేద్కర్, జగ్జీవన్ రామ్ ఆలోచనలు కలగలిపితేనే  భారతరాజ్యాంగం అని అన్నారు. వారి ఆలోచనా విధానంతోనే  మన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు చేపడుతూ ముందుకు వెళ్తున్నారని అన్నారు. బడుగు, బలహీన వర్గాలను పైకి తీసుకువచ్చేందుకు అలుపెరుగక పనిచేస్తున్నారని అన్నారు. గొప్ప పరిపాలన అంటే శ్రీ వైయస్ జగన్ పరిపాలన మాత్రమే అనేలా రాష్ర్టంలో సుపరిపాలన సాగుతోందన్నారు.

       ప్రభుత్వ సలహాదారులు  జూపూడి ప్రభాకరరావు రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక విప్లం గురించి మాట్లాడుతూ.. బాబూ జగ్జీవన్ రామ్ భారత రాజకీయాలలో గొప్పయోధుడు అని కొనియాడారు. నిమ్నవర్గాలకు అంబేద్కర్ హక్కులు ఇస్తే..  వాటిని అమలులో చూపిన మహానుభావుడు జగ్జీవన్ రామ్ అని అన్నారు. 

శాసనమండలిలో విప్  జంగాకృష్ణమూర్తి మాట్లాడుతూ.. బాబూ జగ్జీవన్ రామ్ ను నేటి రాజకీయనేతలు ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని అన్నారు. దేశానికి ఆయన అందించిన సేవలు ఎన్నటికీ మరువలేమని తెలియచేశారు.

శాసనమండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతికి విశేష సేవలందించిన వ్యక్తి బాబూ జగ్జీవన్ రామ్ గారు అని అన్నారు. బడుగు,బలహీనవర్గాలు అన్నిరంగాలలో అభివృధ్ది చెందేవిధంగా విశేష కృషి చేశారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో గ్రంధాలయపరిషత్ రాష్ర్ట ఛైర్మన్  మందపాటి శేషగిరిరావు,ఎ స్సీ కార్పోరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ, నవరత్నాల ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి, పలు కార్పోరేషన్ల ఛైర్మన్లు, డైరక్టర్లు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

Back to Top